పులులను రక్షిద్దాం
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:33 AM
పులులను రక్షిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం’ అంటూ జిల్లాలోని పలుచోట్ల బుధవారం ర్యాలీలు నిర్వహించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మార్కాపురం, దోర్నాల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో వీటిని చేపట్టారు.
జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
జిల్లాలో అటవీశాఖ ర్యాలీలు
మార్కాపురం, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : ‘పులులను రక్షిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం’ అంటూ జిల్లాలోని పలుచోట్ల బుధవారం ర్యాలీలు నిర్వహించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మార్కాపురం, దోర్నాల, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో వీటిని చేపట్టారు. పులుల సంరక్షణ, వాటివల్ల ప్రయోజనాలను వివరిస్తూ నినాదాలు చేశారు. మార్కాపురం పట్టణంలో అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది. ఈ సంద ర్భంగా పులి వేషధారణతో విద్యార్థులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పులుల పాత్ర కీలకమని, వాటి సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ అధికారులు ప్రజలకు వివరించారు. వారితోపాటు మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ పిచ్చిరెడ్డి, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్‌రెడ్డి, ఏవో ఖాజా మొహిద్దీన్, చంద్రమౌళిరెడ్డి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు గైకోటి రవి, గుంటక సుబ్బారెడ్డి, వనజాక్షి పాల్గొన్నారు.