Share News

చలో తిరుపతి

ABN , Publish Date - Jun 12 , 2026 | 02:52 AM

రెండేళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలో శుక్రవారం భారీ విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. కూటమి పార్టీల తరఫున దీన్ని నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తోపాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు.

చలో తిరుపతి
తిరుపతిలో సభ ఏర్పాట్ల వద్ద ఎమ్మెల్యే ఏలూరి, దామచర్ల సత్య

రెండేళ్ల కూటమి పాలన విజయోత్సవ సభకు ఉమ్మడి జిల్లా కీలక నేతలు

అనంతరం నియోజకవర్గ, జిల్లాస్థాయి కార్యక్రమాల నిర్వహణ

ఒంగోలు, జూన్‌ 11 (ఆంఽధ్రజ్యోతి) : రెండేళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలో శుక్రవారం భారీ విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. కూటమి పార్టీల తరఫున దీన్ని నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తోపాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. ఆ సభకు జనసమీకరణ స్థానికంగా తిరుపతి జిల్లాకే పరిమితం చేసినా రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రాంతాల నుంచి కూటమి పార్టీలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరుకావాలని ఆదేశించారు. తదనుగుణంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు కీలక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు తిరుపతికి వెళ్లారు. అక్కడ సభ ఏర్పాట్లలోనూ భాగస్వామ్యమై పనిచేస్తున్నారు. తిరుపతి జోనల్‌ టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న జిల్లాకు చెందిన మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య నాలుగు రోజులుగా అక్కడి నేతలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే అధిష్ఠానం ఆదేశా లతో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా గురువారం అక్కడికి వెళ్లి ఏర్పాట్లలో పాల్గొన్నారు. తిరుపతి సభ అనంతరం అన్ని జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలోనూ రెండేళ్ల విజయోత్సవ సభలకు అధిష్ఠానం ఆదేశించింది. అందిన సమాచారం మేరకు ఈనెల 18న జిల్లాస్థాయి సభ, అంతకు ముందు నియోజకవర్గ స్థాయి సభలు జరిగే అవకాశం ఉంది. అలాగే జిల్లా, నియోజకవర్గానికి ఒక్కో థీమ్‌ను కూడా అధిష్ఠానం కేటాయించి వాటిపై చర్చకు సూచించినట్లు సమాచారం.

Updated Date - Jun 12 , 2026 | 02:52 AM