పల్లెకు పోదాం.. చలోచలో
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:32 AM
సంక్రాంతికి విద్యాలయాలకు సెలవులు ప్రక టించడంతో విద్యార్థులు, ఉద్యోగులు పట్టణాలు వదిలి పల్లెబాట పట్టారు.
ఇంకొల్లు, జనవరి 11,(ఆంధ్రజ్యోతి) : సంక్రాంతికి విద్యాలయాలకు సెలవులు ప్రక టించడంతో విద్యార్థులు, ఉద్యోగులు పట్టణాలు వదిలి పల్లెబాట పట్టారు. దూరప్రాంతాల నుంచి సొంత ఊర్లకు తరలిరావడంతో బస్టాం డులు ప్రయాణికులతో రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణం గగనంగా మారింది. వేలాదిగా తరలివస్తున్న ప్రయాణీకులకు సరిపడా బస్సులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సివస్తోంది. గమ్యస్థానాలకు రావాల్సిన బస్సులు వచ్చిన సమయంలో ప్రయాణికులు ఎగబడి బస్సులు ఎక్కాల్సి వస్తోంది. కొంత మంది గంటల కొద్ది బస్టాండ్లలో వేచి ఉంటున్నారు. బస్సుల్లో కనీసం కాలుతీసి కాలు పెట్టలేనంత రద్దీగా ఉన్నాయి. ఈ ప్రాంతం లో చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల ప్రజలు తమ అవస రాలకు ఇంకొల్లు చేరుకోవాల్సి ఉండగా పండుగ వేళ ప్రయాణికులకు అవస్థలు తప్పడంలేదు. ఇంకొల్లు నుంచి ఒంగోలు, అద్దంకి, గుంటూరు తిరుగు బస్సు సర్వీసులు సైతం కిటకిటలా డుతూ తిరిగాయి. వివిధ ప్రాంతాలను నుండి సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలిరాగా బంధుమిత్రులతో పల్లెలోగిల్లు కళకళలాడుతున్నాయి. గ్రామాలలో ఏ వీధిలో చూసినా కార్ల సందడి కనిపిస్తోంది.