Share News

ఇంటింటికీ వెళదాం..

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:14 AM

తెలు గు తమ్ముళ్లు మరోసారి జనంబాట పట్టను న్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయా లను ప్రజలకు వివరించే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని అధిష్ఠానం రూపొందించింది.

ఇంటింటికీ వెళదాం..
ఒంగోలు నియోజకవర్గ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న ఎమ్మెల్యే జనార్దన్‌

రెండేళ్ల విజయలను వివరిద్దాం

27 నుంచి టీడీపీ నేతల జనంబాట

నెలన్నర రోజులు కార్యక్రమం

నిర్వహణపై నియోజకవర్గస్థాయి సమావేశాలు

ఒంగోలు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తెలు గు తమ్ముళ్లు మరోసారి జనంబాట పట్టను న్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయా లను ప్రజలకు వివరించే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని అధిష్ఠానం రూపొందించింది. ఈనెల 27 నుంచి నెలన్నర రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజ కవర్గాల్లో ఈ కార్యక్రమ నిర్వహ ణకు పార్టీ నిర్ణయించింది. తదను గుణంగా ఇటు ప్రకాశంలో, అటు మార్కాపురం జిల్లాలోనూ పార్టీశ్రే ణులు సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గం యూనిట్‌గా కార్యక్రమాన్ని నిర్వహించనుం డటంతో క్రమపద్ధతిలో సాగేలా ఆయా నియో జకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు దృష్టిసా రించారు. కార్యక్రమం విజయవంతమే లక్ష్యంగా నియోజకవర్గస్థాయిలో సన్నాహక సమావేశాలను నిర్వహించాలని అధిష్ఠానం ఆదేశించింది. తదనుగుణంగా బుధవారం రెండు జిల్లాల్లోని ఒంగోలు, సంతనూతల పాడు, కనిగిరి, మార్కాపురం ఎర్రగొండపాలెం నియోజకవర్గాల సమావేశాలు జరిగాయి.

ముఖ్యనాయకులతో సమావేశం

ఒంగోలులోని తన కార్యాలయంలో ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ సమావేశాన్ని ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ నిర్వహించారు. మండల అధ్యక్ష, కార్యదర్శులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, కోఇన్‌చార్జిలు వంటి ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నెలన్నరపాటు నిర్వహించే కార్యక్రమంపై చర్చించారు. అలాగే ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాయకులతో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమావేశమయ్యారు. ఇంటింటికీ టీడీపీపై చర్చించారు. కనిగిరిలో అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెంలో అక్కడి ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు ఈ తరహా సమావేశాలు నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో గురు, శుక్రవారాల్లో ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్లలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలలో ప్రధానమైన సంక్షేమ, అభివృద్ధి అంశాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. స్థానికంగా ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో వార్డుల వారీ చేసిన పనులను కూడా ప్రజలకు వివరించేలా కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రిని నేతలు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Jul 23 , 2026 | 03:14 AM