Share News

ప్రైవేటును వీడి ప్రభుత్వ బడికి..

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:11 AM

మండలం లోని వెంగళాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో బుధవారం ఒక్కరోజే 35 మంది విద్యా ర్థులు ప్రైవేటు పాఠశాలను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. పెదయిర్లపాడు, పీసీపల్లి, అన్నపురెడ్డిపల్లి తదితర గ్రామాల నుంచివిద్యార్థులు వెంగళా యపల్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యాబోధనకు ఆకర్షితులై చేరారని మండల విద్యాధికారులు ఆర్‌.శ్రీనివాసులు, జి.సంజీవ్‌ తెలిపారు.

ప్రైవేటును వీడి ప్రభుత్వ బడికి..

పీసీపల్లి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : మండలం లోని వెంగళాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో బుధవారం ఒక్కరోజే 35 మంది విద్యా ర్థులు ప్రైవేటు పాఠశాలను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. పెదయిర్లపాడు, పీసీపల్లి, అన్నపురెడ్డిపల్లి తదితర గ్రామాల నుంచివిద్యార్థులు వెంగళా యపల్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యాబోధనకు ఆకర్షితులై చేరారని మండల విద్యాధికారులు ఆర్‌.శ్రీనివాసులు, జి.సంజీవ్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విదార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం, యూనిఫాం, షూలు, బెల్ట్‌లు, పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు.

Updated Date - Jun 25 , 2026 | 03:11 AM