లీప్‌యాప్ డౌన్‌లోడ్‌లో వెనుకంజ
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:23 AM
విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌కు లీప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలు వెనుకం జలో ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 25వ స్థానంలో ఉంది.
చివరి స్థానాల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలు
ఒంగోలు విద్య, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌కు లీప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలు వెనుకం జలో ఉన్నాయి. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 25వ స్థానంలో ఉంది. మార్కాపురం జిల్లా 26వ స్థానంలో నిలిచింది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2.06 లక్షల మంది విద్యార్థులు చేరగా వీరిలో కేవలం 928 మందికి మాత్రమే లీప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు. మార్కా పురం జిల్లాలో 1.55 లక్షల మంది విద్యార్థులు చేరగా వీరిలో కేవలం 614 మంది మొబైల్స్‌కు మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. లీప్ యాప్‌లో విద్యార్థుల లాగిన్‌ను క్రియేట్ చేసి వారికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తారు. సెలవుల వివరాలు, హాజరు, పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షల్లో విద్యార్థులు సాధిస్తున్న మార్కులు, ప్రగతి, రోజువారీ హోంవర్క్ కూడా యాప్‌లోనే పెట్టనున్నారు. ఈ యాప్‌పై పాఠశాలల అడ్మిషన్ సమయంలో విద్యార్థినులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే పాఠశాలలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్స్‌కు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే విషయంలో నిర్లిప్తత కనిపిస్తోంది.