రైతుల భవిష్యత్‌కు భూమి హక్కు పత్రం పునాది
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:24 PM
భూమి హక్కు రైతుల భవిష్యత్‌కు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు.
మీ భూమి మీ హక్కులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): భూమి హక్కు రైతుల భవిష్యత్‌కు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని పొదలకొండపల్లె గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు తన భూమిపై పూర్తి హక్కుతో సాగు చేసుకునేలా ప్రభుత్వం చట్టబద్ధత పత్రాలను అందిస్తుందన్నారు. గిద్దలూరు ప్రాంతంలో 70 శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 56 నియోజక వర్గాలకు నీరు అందించవచ్చని తెలిపారు. ఉద్యాన పంటలు సాగు చేసుకోవడం ద్వారా మంచి దిగుబడులతోపాటు ఆదాయం లభిస్తుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు పూర్తి స్థాయిలో నీరు అందించడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బైలడుగు బాలయ్య, గ్రామసర్పంచ్ ఆవుల వెంకటసుబ్బమ్మ, టీడీపీ నాయకులు రాజగోపాల్, గొంటు బ్రహ్మానందరెడ్డి, చేరెడ్డి జయరామిరెడ్డి, రామిరెడ్డి, పందనబోయిన రవి, గొంటు పుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ బోదనబోయిన గోపాలక్రిష్ణ, కడియం శేషగిరి, శీలం శివారెడ్డి, దప్పిలి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.