ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్‌గా కృష్ణయ్య
ABN , Publish Date - May 13 , 2026 | 03:07 AM
ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా టి.వెంకటకృష్ణయ్య నియమితులయ్యారు. ఈమేరకు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పి.సంపత్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఒంగోలు కార్పొరేషన్, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా టి.వెంకటకృష్ణయ్య నియమితులయ్యారు. ఈమేరకు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పి.సంపత్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పూడా- నరసరా వుపేట) సెక్రటరీగా ఉన్న కృష్ణయ్యకు ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో కమిషనర్‌గా ఉన్న కోడూరు వెంకటేశ్వరరావు నెలరోజులపాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ టి.రాంభూపాల్‌రెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వెంకటేశ్వరరావు సెలవు గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో ఆయన బుధవారం బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో వెంకటకృష్ణయ్యను కమిషనర్‌గా నియమించారు. రెండు రోజులలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.