Share News

వైభవంగా కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:18 AM

చిన గంజాం పంచాయతీ పరిధిలోని పూలవారి పాలెం గ్రామంలో హనుమత్‌ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి శిలావిగ్రహ ప్రతిష్ఠామహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ

చినగంజాం, మార్చి 2(ఆంధ్రజ్యోతి) : చిన గంజాం పంచాయతీ పరిధిలోని పూలవారి పాలెం గ్రామంలో హనుమత్‌ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి శిలావిగ్రహ ప్రతిష్ఠామహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో బ్రహ్మశ్రీ వేదాంతం రంగాచార్యులు ఆఽధ్వర్యం లో ఉదయం సుప్రభాతం, మంగళవాయిద్యం నిత్యారాధన, విష్వక్సేనపూజ, పుణ్యాహావాచన నూతన విగ్రహాలకు పంచామృత స్నపన స్వర దేవతా హోమం, రత్నవాస్యం,, ధాతున్యాసం తదితర కార్యక్రమాలను దంపతులతో నిర్వహించారు. అనంతరం ఆలయంలో హనుమత్‌ సమేత సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి శిలా విగ్రహా లను ప్రతిష్ఠించారు. ఆలయ అర్చకులు మోహనలక్ష్మీనరసింహా చార్యులు, వెంకటచార్యులు ప్రతిష్ఠ పూజలు అనంతరం స్వామి వార్లను విశేషంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పూజలు నిర్వహించి తీర ్థప్రసాదాలను స్వీకరించారు. స్వామి వార్ల ఉత్సవ విగ్రహలను ప్రత్యేకంగా అలంకరించి వేదపండితులు దంపతులచే స్వామి వారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోిని అంకమ్మతల్లి ఆలయ ప్రాంగణం లో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో సమీప గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:18 AM