Share News

ఏఐతో చిన్నారులకు విజ్ఞానం

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:39 PM

ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చిన్నారులకు మరింత విజ్ఞానాన్ని పెంచాలని కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. పట్టణంలోని నెహ్రూ బజారులోని సాయి ఫంక్షన్‌ హాలులో ఏఐ ఎనేబుల్‌ స్ర్కీనింగ్‌ ఫర్‌ 0-6 శిక్షణ కార్యక్రమంపై అధికారులతో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

ఏఐతో చిన్నారులకు విజ్ఞానం
మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయ సునీత

శిక్షణ తరగతుల ప్రారంభంలో కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం రూరల్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చిన్నారులకు మరింత విజ్ఞానాన్ని పెంచాలని కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. పట్టణంలోని నెహ్రూ బజారులోని సాయి ఫంక్షన్‌ హాలులో ఏఐ ఎనేబుల్‌ స్ర్కీనింగ్‌ ఫర్‌ 0-6 శిక్షణ కార్యక్రమంపై అధికారులతో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరేఏళ్ల లోపు చిన్నారులకు ఐదు ప్రధానాంశాలపై స్ర్కీనింగ్‌ చేయాలని తెలిపారు. స్థూల, సూక్ష్మ చలనం, భాష, జ్ఞాన శక్తి సామాజిక భావోద్వేగ అంశాలు ఏదశలో ఉన్నాయో తెలుస్తాయన్నారు. సాధారణంగా పిల్లలలో వచ్చే అవయవ, విటమిన్‌ లోపాలను తెలుసుకోవచ్చునని తెలిపారు. చిన్నారులకు మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వాడకం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో రాష్ర్టీయ బాల స్వస్తి ప్రోగ్రాం అధికారి డీ చంద్రశేఖర్‌, జిల్లా ఇమ్యునిజేషన్‌ అధికారి ఏ సుజన్‌, జిల్లా టీబీ అధికారి కే రాహుల్‌, డీపీఎంవో జగదీష్‌, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీ పద్మావతి, పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:39 PM