Share News

డిజిటల్‌ వేదికల్లో కనిగిరికి గుర్తింపు అభినందనీయం

ABN , Publish Date - May 17 , 2026 | 11:32 PM

పార్టీ బలోపేతానికి డిజిటల్‌ వేదికలు కీలక సాఽధనాలుగా మారిన తరుణంలో కనిగిరికి గుర్తింపు తీసుకు వచ్చేలా ర్యాంకులు సాధించటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

డిజిటల్‌ వేదికల్లో కనిగిరికి గుర్తింపు అభినందనీయం
ర్యాంకర్లకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మే 17 (ఆంధ్రజ్యోతి) : పార్టీ బలోపేతానికి డిజిటల్‌ వేదికలు కీలక సాఽధనాలుగా మారిన తరుణంలో కనిగిరికి గుర్తింపు తీసుకు వచ్చేలా ర్యాంకులు సాధించటం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి ప్రాంగణంలో మై టీడీపీ యాప్‌ ద్వారా నియోజకవర్గ పరిధిలో టాప్‌ - 10 ర్యాంకులు సాధించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మై టీడీపీ యాప్‌ ద్వారా పార్టీ కార్యక్రమాలను సమర్ధవంతంగా ప్రజలకు చేరవేస్తూ యువత చురుకుగా పనిచేయటం అభినందనీయమన్నారు. నియోజ కవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచి టాప్‌ - 10లో నిలిచిన కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే పార్టీ కోసం కష్ట పడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, నియోజకవర్గ పరిధిలో బహుమతులు అందుకున్న ర్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:32 PM