Share News

మద్దతు ధరతో రైతుకు న్యాయం

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:35 PM

కంభం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం-డీ 200 పరిధిలో ఏపీ మార్కెట్‌, నా ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరపై శనగలు, కందులు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు.

మద్దతు ధరతో రైతుకు న్యాయం
కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

కందులు, శనగలు కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : కంభం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం-డీ 200 పరిధిలో ఏపీ మార్కెట్‌, నా ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరపై శనగలు, కందులు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ధరలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ప్రాంతీయ రైతులకు ఆర్ధిక భరోసా కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కంభం సహకార సంఘం ఛైర్మన్‌ కేతం శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనగలు, కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు ఆర్ధిక స్థిరత్వానికి బలమైన పునాదిని వేసిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

గలిజేరుగుళ్ల సొసైటీ ద్వారా శనగలు కొనుగోలు

బేస్తవారపేట : మండలంలోని గలిజేరుగుళ్ల సొసైటీ ద్వారా కందులు, శనగల కొనుగోలును ప్రారంభించినట్లు వ్యవసాయాధికారి షేక్‌ అబ్దుల్‌ రషీక్‌ తెలిపారు. కందులకు ప్రభుత్వం మద్దతు ధర రూ.8వేలు, శనగలకు రూ.5,850ని ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సోసైటీ చైర్మన్‌ గుంటక నరసింహులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు .. ఎమ్మెల్యే ఉగ్ర

వెలిగండ్ల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : రైతలు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెలే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో రైతు సేవాకేంద్రం వద్ద మార్కెఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యేతో కలిసి డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 11:35 PM