జూనియర్ డాక్టర్ల సమ్మె
ABN , Publish Date - Aug 12 , 2026 | 01:58 AM
స్టైఫండ్‌ను పెంచా లని డిమాండ్ చేస్తూ పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సమ్మెకు దిగా రు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం విధులను బహిష్కరించి ఒంగోలులోని జీజీహెచ్‌లో నిరసన చేపట్టారు.
ఒంగోలు జీజీహెచ్‌లో ధర్నా
స్టైఫండ్ పెంచాలని డిమాండ్
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : స్టైఫండ్‌ను పెంచా లని డిమాండ్ చేస్తూ పీజీ, ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులు సమ్మెకు దిగా రు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం విధులను బహిష్కరించి ఒంగోలులోని జీజీహెచ్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసి యేషన్ అధ్యక్షుడు జి.భార్గవసాయినాయుడు, ఉపాధ్యక్షుడు ఫయాజ్‌ఖాన్ మాట్లాడుతూ తమ స్టైఫండ్ విషయమై ధికారులతో నిర్వహించిన చర్చల్లో ఎలాంటి హామీ లభించలేదన్నారు. దీంతో న్యాయమైన డిమాం డ్‌ల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లినట్లు తెలిపారు. బుధవారం కూడా సమ్మెను కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం ఈనెల 15వ తేదీ వరకు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.