జూనియర్ డాక్టర్‌ల ఆందోళన ఉధృతం
ABN , Publish Date - Aug 18 , 2026 | 02:23 AM
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. ఏడో రోజైన సోమవారం నుంచి ఒంగోలు జీజీహెచ్‌లోని ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, మెడికల్ పీజీ విద్యార్థులు అత్యసవర సేవలను కూడా బహిష్కరించారు.
పూర్తిస్థాయిలో విధుల బహిష్కరణ
జీజీహెచ్ వద్ద నిరసన
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 17 (ఆంధ్ర జ్యోతి): సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. ఏడో రోజైన సోమవారం నుంచి ఒంగోలు జీజీహెచ్‌లోని ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, మెడికల్ పీజీ విద్యార్థులు అత్యసవర సేవలను కూడా బహిష్కరించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం అధ్యక్షుడు భార్గవసాయి నాయుడు, ఉపాధ్యక్షుడు ఫయాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా తమ సమస్యలు పరిష్క రించాలని ప్రభుత్వానికి వివిధ రూపాలలో వినతులు అందజేసినట్లు తెలిపారు. స్టైఫండ్ పెంచడంతోపాటు, మౌలిక సౌకర్యాల కల్పన, ప్రస్తుతం విధుల్లో ఉన్న వైద్యుల పదవీ కాలం తగ్గించాలని పదేపదే విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాము విధుల్లోకి వెళ్లేది లేదనితెలిపారు. ఆసుపత్రి ఆవరణలో నిరసనను కొనసాగించారు.