రైతుల్లో ఆనందం
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:48 AM
తరతరాలుగా వివిధ కారణాలతో తమ భూమిపై హక్కు లేక దిగాలుగా ఉన్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇకపై తమకే హక్కు పత్రం లభించబోతుందన్న భరోసా వారికి లభించింది. ఇప్పటికే జిల్లాలో 1,301 మంది రైతులు ఇలాంటి సమస్య నుంచి బయటపడ్డారు.
జిల్లాలో 1,301 మందికి ప్రయోజనం
నర్సింగోలులో ముఖ్యమంత్రి సభతో రైతుల్లో పెరిగిన నమ్మకం
ఇకపై రామాయపట్నం మహా నగరమే
దొనకొండ కారిడార్‌కు నీళ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తా
గోవాను మించనున్న సూర్యలంక .. పాకల మరో పర్యాటక కేంద్రం
చంద్రబాబు ప్రకటన 8 భారీగా వచ్చిన ప్రజలతో సభ విజయవంతం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
తరతరాలుగా వివిధ కారణాలతో తమ భూమిపై హక్కు లేక దిగాలుగా ఉన్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇకపై తమకే హక్కు పత్రం లభించబోతుందన్న భరోసా వారికి లభించింది. ఇప్పటికే జిల్లాలో 1,301 మంది రైతులు ఇలాంటి సమస్య నుంచి బయటపడ్డారు. ఇంకా అలాంటి ఇబ్బందులు ఉన్న వేలాది మంది రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సంబరపడుతున్నారు. శుక్రవారం నర్సింగోలులో జరిగిన కార్యక్రమంలో సీఎం చెప్పిన మాటలు ఆ రైతుల్లో నమ్మకాన్ని వందరెట్లు పెంచాయి. అలాగే కొండపి నియోజకవర్గంతోపాటు జిల్లా అభివృద్ధికి సంబంధించి చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ సభకు మంత్రి స్వామి, సత్యల ఆధ్వర్యంలో ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
గ్రామాల్లో దేవదాయ, 22ఏ, గర్భకండ్రిక, ఈనాం లాంటి సమస్యలతో సొంత భూమిపై హక్కు లభించక రైతులు తరతరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిష్కరించి సాగులో ఉన్న వారికి భూమిపై హక్కు కల్పిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. అందులో భాగంగా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు తదితర గ్రామాల్లో అలాంటి రైతుల గ్రామాల్లో దేవదాయ, 22ఏ, గర్భకండ్రిక, ఈనాం లాంటి సమస్యలతో సొంత భూమిపై హక్కు లభించక రైతులు తరతరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిష్కరించి సాగులో ఉన్న వారికి భూమిపై హక్కు కల్పిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. అందులో భాగంగా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు తదితర గ్రామాల్లో అలాంటి రైతుల భూసమస్యలు పరిష్కరించి పట్టాలను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఆ ప్రకారం జిల్లాలో నాలుగు మండల్లాలోని ఎనిమిది గ్రామాల్లో 2,915.10 ఎకరాల భూములకు ఇప్పటికే పరిష్కార మార్గం చూపారు. ఒక్క నర్సింగోలు గ్రామంలోనే ఇలాంటి సమస్యల్లో ఉన్న 400.24 ఎకరాలకు సంబంధించి 209 మందికి వారి భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలను ఇచ్చారు. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అలాంటి భూములు ఉన్న అన్నింటిపై రైతులకు హక్కు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతేకాక గర్భకండ్రిక అనే పేరుతో భూములకు సమస్యలు ఉండటం తనకు తెలియదని, ఇక్కడే తెలుసుకున్నానని.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి భూములు ఉంటే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో కూడా గర్భకండ్రిక భూములు అధికంగా ఉన్నందున మున్ముందు ఆ రైతులకు న్యాయం జరగబోతోంది.
రామాయపట్నం ఇక మహానగరమే
జిల్లాలో ఉన్న రామాయపట్నం ఒంగోలు, కందుకూరుకు మించి మహానగరంగా మారబోతోందని చంద్రబాబు చెప్పారు. అందుకు గతంలో అక్కడ పోర్టు నిర్మాణానికి తాను చర్యలు తీసుకోవడంతోపాటు ప్రస్తుతం రూ.1.50 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ ప్రాజెక్టును తీసుకురావడం, మరో రెండు ప్రాజెక్టులు ఇప్పటికే అక్కడ నిర్మాణానికి చర్యలు తీసుకోవడాన్ని ఆయన గుర్తుచేశారు. రామాయపట్నం పోర్టుతోపాటు ఆ ప్రాంతంలో అనుకున్నపరిశ్రమలన్నీ ఏర్పాటయ్యే వరకు విశ్రమించనని తెలిపారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నీరు, విద్యుత్ సమస్యను తొలగించే కార్యక్రమాలను చేపడతానని హామీ ఇచ్చారు. మీ పక్కనే ఉన్న సూర్యలంక తీరప్రాంతం గోవాను మించిన పర్యాటక కేంద్రం కాబోతుందన్నారు. అలాగే పాకలను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వెలిగొండ రెండోదశ నిర్మాణాన్ని పూర్తిచేస్తానని చెబుతూ పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఇటు ప్రాజెక్టులు, అటు పరిశ్రమలు, ఇంకోవైపు తీరప్రాతం అభివృద్ధి మధ్యలో హార్టికల్చర్ హబ్ లాంటి కార్యక్రమాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా భవిష్యత్తులో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండబోతుందని తెలిపారు. అలాగే కొండపి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి స్వామి అడిగిన సమస్యలను ప్రస్తావిస్తూ నియోజకవర్గ పరిధిలోని మూడు నదులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణాలకు రమారమి రూ.80 కోట్లకు పైగా నిధుల కేటాయింపునకు కూడా హామీ ఇచ్చారు.
దామచర్లను తలచుకొని.. స్వామి, మాగుంట, సత్యలను కొనియాడి..
సభలో తొలుత చంద్రబాబు దివంగత మాజీ మంత్రి, నియోజకవర్గ ప్రజలు పెద్దాయనగా పిలుచుకునే దామచర్ల ఆంజనేయలును గుర్తుచేసుకొన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, టీడీపీ నాయకుడిగా ఆయన చేసిన సేవలను సీఎం కొనియాడారు. పట్టుదలకు మారు పేరంటూ కీర్తించారు. అలాగే ఆయన శిష్యుడు, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మంత్రి స్వామిని కూడా కొనియాడుతూ ప్రతిపక్షంలో ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయనకు తాను ఎప్పుడు అండగా ఉంటానని ప్రకటించారు. ఎంపీ మాగుంట గురించి ప్రస్తావిస్తూ మాగుంట కుటుంబం అంటే ఒక బ్రాండ్ అంటూ ప్రశంసించారు. మారిటైం బోర్డు చైర్మన్ సత్యను యువనాయకుడిగా పొగిడారు.
గ్రామాల నుంచి కదిలిన జనం
నర్సింగోలులో సీఎం సభకు కేవలం కొండపి నియోజకవర్గం నుంచే భారీగా ప్రజలు తరలిరావడం విశేషం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు రావడం కనిపించింది. కొండపి, జరుగుమల్లి మండలాల నుంచి అయితే విశేషంగా వచ్చారు. నియోజకవర్గంలో 112 పంచాయతీలు ఉండగా ప్రతిచోట నుంచి సభకు వచ్చినట్లు ఒక పరిశీలనలో వెల్లడైంది. పూర్తిగా వ్యవసాయాధారమైన నియోజకవర్గం కావడంతో అత్యధిక మంది ట్రాక్టర్లలో వచ్చారు. సమీప గ్రామాల్లో నుంచి ఆటోల్లోనూ వచ్చారు. సూదూర గ్రామాలవారైతే ప్రత్యేక బస్సుల్లో రావడం కనిపించింది. అటు మంత్రి స్వామి, ఇటు సత్యలు ఈ టర్మ్‌లో సీఎంగా చంద్రబాబు నియోజకవర్గానికి తొలిసారి వస్తున్నందున ప్రజలంతా కదిలి రావాలని ఊరూవాడా పిలుపునివ్వడంతో వారంతా భారీగా కదిలివచ్చారు.