Share News

తెలుగు తమ్ముళ్లలో జోష్‌

ABN , Publish Date - May 26 , 2026 | 01:33 AM

తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో మహానాడు జోష్‌ కనిపి స్తోంది. నెల్లూరు మహానాడు రద్దు అయినప్ప టికీ ప్రత్యామ్నాయంగా క్లస్టర్‌ స్థాయిలో నిర్వ హణకు అధినేత నిర్ణయించడంతో ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు రంగంలోకి దిగారు.

తెలుగు తమ్ముళ్లలో జోష్‌
మర్రిపూడిలో పార్టీ నాయకులతో మాట్లాడుతున్నటీడీపీ రాష్ట్ర కార్యదర్శి చందన స్రవంతి

క్లస్టర్‌ స్థాయిలో మహానాడు

జిల్లాలో 67 కేంద్రాల్లో నిర్వహణ

భారీ ఏర్పాట్లలో టీడీపీ శ్రేణులు

ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు

సమావే శాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్న నేతలు

ఒంగోలు మే 25 (ఆంధ్రజ్యోతి) : తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో మహానాడు జోష్‌ కనిపి స్తోంది. నెల్లూరు మహానాడు రద్దు అయినప్ప టికీ ప్రత్యామ్నాయంగా క్లస్టర్‌ స్థాయిలో నిర్వ హణకు అధినేత నిర్ణయించడంతో ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు రంగంలోకి దిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 67 క్లస్టర్లు ఉండగా క్లస్టర్‌ యూనిట్‌గా మహానాడును నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో పార్టీ స్థానిక నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. సాధారణంగా నియోజకవర్గ, పార్లమెంట్‌ లేదా జిల్లాస్థాయిలో మినీ మహానాడులు, అనంతరం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో మూడు లేదా రెండు రోజులు మహానాడును టీడీపీ నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియలో నియోజకవర్గ స్థాయిలో కీలక నేతలైన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు ప్రధాన భూమి క పోషిస్తారు. అలాగే ఈసారి కూడా షెడ్యూ ల్‌ను తొలుత పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నెల్లూరులో మహానాడు నిర్వహణకు సన్నా హాలు చేశారు. ఇదేసమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అన్ని విష యాల్లోనూ, ప్రత్యేకించి ఆయిల్‌ వాడకంలో పొదుపు పాటించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. దానిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మినీ మహానాడులు అన్నింటినీ రద్దుచేశారు. మహానాడును కూడా మూడు రోజులకు బదులుగా రెండు రోజులకు కుదించడంతోపాటు నెల్లూరులో భారీగా కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పొలిట్‌బ్యూరో సభ్యులు మాత్రమే అక్కడి నుంచి పాల్గొననున్నారు. జిల్లాస్థాయి, నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పార్టీశ్రేణులు డిజిటల్‌ మహానాడులో భాగస్వాములు కావాలని సూచించారు.

క్రియాశీలకంగా క్లస్టర్‌ విధానం

ప్రస్తుతం టీడీపీ సంస్థాగత నిర్మాణంలో గ్రామ, వార్డు కమిటీలు.. మండల, పట్టణ కమిటీలకు మధ్య క్లస్టర్‌ విధానం క్రియాశీ లకంగా పనిచేస్తుంది. 20నుంచి 25 వేల ఓట ర్లకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. డిజిటల్‌ మహానాడు నిర్వహణకు నిర్ణయించుకున్న అధిష్ఠానం దానికి క్లస్టర్‌ స్థాయిలో పార్టీశ్రే ణులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంది. ఒక్కో క్లస్టర్‌కు ఒకచోట సభా ప్రాంగణాలు ఏర్పాటు చేసి జెండావిష్కరణ, సభల నిర్వహణతోపాటు కేంద్ర కార్యాలయ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ క్లస్టర్‌ పరిధిలోని గ్రామ, వార్డుల్లో ఉండే క్రియాశీల కార్యకర్తలు, నాయకులు అందులో పాల్గొనేలా చూడాలని అధిష్టానం ఆదేశించింది. తదనుగుణ చర్యలపై జిల్లాలోని పార్టీ నేతలు దృష్టి సారించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 67 క్లస్టర్లు ఉండగా ఒక్కో దానికి ఒక చోట ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు నగరంలో 9 క్లస్టర్లు ఉండగా ఒక్కో దానికి కల్యాణ మండపం లేదా ఆస్థాయి హాళ్లను ఇప్పటికే బుక్‌ చేశారు. ఇతర నియోజకవర్గాల్లోనూ అలాగే చేస్తున్నారు. కొన్ని క్లస్టర్లకు అలాంటి ఇండోర్‌ హాళ్లు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉండే గోడౌన్లు, ఇతరత్రా వాటిలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా డిజిటల్‌ మహానాడులను విజయవంతం చేయడంపై పార్లమెంట్‌, అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు.. మండల, క్లస్టర్‌ స్థాయిలోనూ ముఖ్యనేతలతో సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే సోమవారం కూడా కొన్ని చోట్ల నిర్వహించారు.

Updated Date - May 26 , 2026 | 01:33 AM