Share News

మార్కాపురం జడ్పీ సీఈవోగా జోసఫ్‌కుమార్‌

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:34 AM

మార్కాపురం జిల్లా పరిషత్‌ సీఈవోగా జోసఫ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేశారు.

మార్కాపురం జడ్పీ సీఈవోగా జోసఫ్‌కుమార్‌

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు

మార్కాపురం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా పరిషత్‌ సీఈవోగా జోసఫ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ప్రకాశం నుంచి మార్కాపురం జడ్పీ విభజన అనంతరం సిబ్బందిని కూడా కేటాయించారు. వేములకోట వద్ద ఉన్న స్వర్ణగ్రామ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ కార్యకలాపాలను ప్రారంభించారు. తాజాగా సీఈవోగా నియమితులైన జోసఫ్‌కుమార్‌ ఇప్పటి వరకూ ప్రకాశం డ్వామా పీడీగా పని చేశారు. నెలరోజులు సెలవు తీసుకొని 15 రోజుల క్రితం అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఇక్కడ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Oct 11 , 2026 | 02:34 AM