Share News

రీసర్వే గ్రామాల్లో జాయింట్‌ ఎల్పీ నెంబర్లు లేకుండా చూడాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:05 AM

రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పీ నెంబర్లు లేకుండా చూడాలని జేసీ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

రీసర్వే గ్రామాల్లో జాయింట్‌ ఎల్పీ నెంబర్లు లేకుండా చూడాలి
వీఆర్వోల సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి

ముండ్లమూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పీ నెంబర్లు లేకుండా చూడాలని జేసీ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రీ సర్వే జరిగిన గ్రామాలలో జాయింట్‌ ఎల్‌పీ నెంబర్లు ఉండకుండా సిబ్బంది చూడాలన్నారు. ప్రస్తుతం రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో తప్పులు లేకుండా చూడాలన్నారు. జాయింట్‌ ఎల్‌పీ నెంబర్లు ఉంటే వీఆర్వోలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఆదేశించారు.

మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే అర్జీదారులకు సంబంధించి రెవెన్యూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలన్నారు. ప్రధానంగా వివిధ రకాల సర్టిఫికెట్లకు మాత్రం కాలయాపన చేయవద్దన్నారు. మండలంలో రైతులకు సంబంధించిన భూములు 22ఏలో పడితే వెంటనే వారిచేత దరఖాస్తులు పెట్టించి ఆర్డీవోకు పంపించాలన్నారు. మండలంలో జీరో ఖాతా భూములు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆదేశించిందన్నారు. ప్రభు త్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలన్నారు.

వివిధ సమస్యలపై రెవెన్యూ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల పట్ల ఆప్యాయత చూపించాలన్నారు. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి తహసీల్దార్‌ ఆర్‌. శ్రీకాంత్‌, ఆర్‌ఐ పీఎ్‌సఆర్‌ మూర్తి, సీనియర్‌ అసిస్టెంట్‌ నాగరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణ ప్రసాద్‌, మండల సర్వేయర్‌లు బి.మల్లిఖార్జున, వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:05 AM