అభివృద్ధిని చూసే చేరికలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:39 PM
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా సాగుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పనులను చూచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
30న ట్రిబుల్ ఐటీ కాలేజీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
వచ్చే నెల 2 నుంచి కనిగిరి-విజయవాడ మధ్య రైలు ప్రారంభం
ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక
పామూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా సాగుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పనులను చూచి టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక సత్యదేవుని కల్యాణ మండపంలో పామూరు మాజీ ఉపసర్పంచ్ వైవీ సాయికిరణ్ ఆధ్వర్యంలో సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరాయి. ముందుగా మాజీ ఉపసర్పంచ్ ఇంటి నుంచి తప్పెట్లు, బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా వచ్చారు.
అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు అమీర్‌బాబు అధ్యక్షతన సభ జరిగింది. సభలో ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ పామూరు పట్టణంలో రూ.10 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ జలాలను మోపాడు ప్రాజెక్ట్‌కు అనుసంధానిస్తే ఈ ప్రాంత వ్యవసాయ స్థితిగతులు మారి వలసలు నివారణవుతాయన్నారు. తాను మాటలు చెప్పనని చేయదగిన పనులే చేస్తానని, ఎన్నికల్లో ఇచ్చిన వెలిగొండ, ఇంటింటికి మంచినీరు, ట్రిబుల్ ఐటీ, రైల్వేలైన్, ఎంఎ్‌సఎంఈ పార్కుల హామీలు అమలవుతుండడంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 30న వందకోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ట్రిబుల్‌ఐటీ నిర్మాణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారని వివరించారు. అక్టోబరు 2 నుంచి కనిగిరి, విజయవాడ మధ్య రైలు నడుస్తుందని తెలిపారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిలో పామూరు సర్పంచ్ అల్లూరి రాగమ్మ, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చల్లా సుబ్బారావు, వార్డు మాజీ సభ్యుడు షేక్ జిలానిబాష, నాయబ్‌రసూల్‌తో పాటు రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు చీతిరాల రమేష్, గోల్డ్ అసోషియేషన్ సభ్యులు పాబోలు రమేష్, సోమిశెట్టి సుబ్బారావు, జాజం సుభాషిణి ఉన్నారు. ఈ కార్యక్రమంలో కోటపాటి జనార్దనరావు, ఇరిగినేని రవీంద్రబాబు, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, యారవ శ్రీను పాల్గొన్నారు.