Share News

73 మందికి ఉద్యోగ నియామక పత్రాలు

ABN , Publish Date - Feb 01 , 2026 | 10:56 PM

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 73 మంది మగ ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు నియామక పత్రాలను అందజేశారు.

73 మందికి ఉద్యోగ నియామక పత్రాలు
మగ ఆరోగ్యకార్యకర్తలకు నియామక పత్రాలు ఇస్తున్న డాక్టర్‌ వెంకటేశ్వర్లు

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 73 మంది మగ ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు నియామక పత్రాలను అందజేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని వైద్యశాఖ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నియామక పత్రాలను అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మగ ఆరోగ్య కార్యకర్తలను తెలంగాణా హైకోర్టు ఇచ్చిన అదేశాల మేరకు 2024 డిసెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. సుదీర్ఘకాలంపాటు పనిచేసిన మగ ఆరోగ్య కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు వీరి పట్ల సానుకూలంగా స్పందించి విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ రాజాబాబు ఆదేశాలతో ఆదివారం రోజునే డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు ఈ నియామక పత్రాలను అందజేశారు.

Updated Date - Feb 01 , 2026 | 10:56 PM