బీరువాలో నగలు చోరీ
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:47 PM
బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. సుమారు రూ.12 లక్షల విలువైన ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితురాలు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడున్నర కిలోల వెండి, 152 గ్రాముల బంగారం అపహరణ
ఒంగోలు క్రైం, జూలై 26(ఆంధ్రజ్యోతి) : బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగలు అపహరించారు. సుమారు రూ.12 లక్షల విలువైన ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధితురాలు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళితే... స్థానిక దేవుడు చెరువులో ఒంటరిగా వి.రమణమ్మ ని వాసం ఉంటుంది. ఆమె కుమార్తె సునీత విహం చేసుకొని కాళహస్తిలో ఉంటుంది. ఆమెకు సంబంంచిన 152 గ్రాముల బంగారం ఆభరణాలు, మూడున్నర కిలోల వెండి వస్తువులను బ్యాంక్ లాకర్‌లోపెట్టెందుకు ఈనెల 9న ఒంగోలు తీసుకొచ్చి లాకర్‌లో పెట్టకుండా ఇం ట్లో బీరువాలో పెట్టి కాళహస్తి వెళుతుంది. ఈనెల 24న ఉదయం ర మణమ్మ బీరువా తెరిచి ఉండటం గమనించి బంగారం, వెండి వస్తువులు పెట్టిన లాకర్ లో చూడగా కనిపించలేదు.ఈమేరకు రమణమ్మ ఒంగోలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.