Share News

జముకులదిన్నె పంచాయతీకి వేలం!

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:36 AM

మండలంలోని జముకులదిన్నె పంచాయతీ సర్పంచ్‌ పదవికి వేలం పాట జరిగింది. అదేగ్రామానికి చెందిన పసుపులేటి రాధ సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ఆమె భర్త మర్రి సత్యనారాయణ గతంలో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జముకులదిన్నె పంచాయతీకి వేలం!

రూ.23.30లక్షలకు సర్పంచ్‌ పదవి దక్కించుకున్న రాధ

దర్శి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని జముకులదిన్నె పంచాయతీ సర్పంచ్‌ పదవికి వేలం పాట జరిగింది. అదేగ్రామానికి చెందిన పసుపులేటి రాధ సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. ఆమె భర్త మర్రి సత్యనారాయణ గతంలో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 ఎన్నికల్లో ఆయన రూ.27లక్షల 40వేలకు పాటపాడి సర్పంచ్‌ పదవిని కైవసం చేసుకున్నారు. గ్రామస్థులందరూ వర్గవిభేదాలను విడనాడి గత రెండేళ్లుగా సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. వేలం పాట ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధి, ఆలయాల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు. ఈసారి పోలేరమ్మ, రామాలయాల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎలాంటి వివాదాలు లేకుండా రెండోసారి కూడా ఉమ్మడిగా ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం విశేషం. ప్రభుత్వం ఏకగ్రీవాలకు ప్రోత్సహిస్తుండడంతో టీడీపీ మద్దతుదారైన పసుపులేటి రాధ సర్పంచ్‌ పదవిని దక్కించుకున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 02:36 AM