పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తికి జైలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:40 PM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి పందిరి లలిత గురువారం తీర్పునిచ్చారు.
ఒంగోలు క్రైమ్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి పందిరి లలిత గురువారం తీర్పునిచ్చారు. ఒంగోలు మండలం వెంగముక్కలపాలేనికి చెందిన వలేటి వీరాంజనేయులు అనే వ్యక్తి 2020 జూలై 28న బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మీ కూతురిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ క్రమంలో బాధితురాలు జీవనోపాధి నిమిత్తం పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి మోసపూరిత మాటలు చెప్పి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాగా నేరం రుజువు కావడంతో న్యాయాధికారి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.