Share News

మార్చిలోనే మండిపోతోంది!

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:22 AM

జిల్లాలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చిలోనే మంటలు మొదలయ్యాయి. వడగాడ్పులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ రెండు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తోంది.

మార్చిలోనే మండిపోతోంది!

పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

పామూరులో అత్యధికంగా 42.6 డిగ్రీలు

నాలుగు మండలాల్లో 40 డిగ్రీలపైనే నమోదు

మార్కాపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చిలోనే మంటలు మొదలయ్యాయి. వడగాడ్పులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ రెండు రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. శనివారం పామూరు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హనుమంతునిపాడులో 40.5, కనిగిరిలో 40.8, అర్ధవీడులో 40.3, బేస్తవారపేటలో 40.3, మార్కాపురంలో 40 డిగ్రీల ఎండ కాచింది. మిగిలిన మండలాల్లో 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated Date - Mar 29 , 2026 | 02:22 AM