Share News

నీళ్లే కాదు.. నిర్వాసితులూ ముఖ్యమే

ABN , Publish Date - Aug 15 , 2026 | 02:51 AM

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో, నిర్వాసి తులకు న్యాయం చేయడం కూడా అంతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో వెలిగొండపై ప్రత్యేకంగా చర్చించారు.

నీళ్లే కాదు.. నిర్వాసితులూ ముఖ్యమే
టీబీఎం తొలగింపు పనులను పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మానవీయ కోణంలో చూడాలని ఆదేశం

ముంపు వాసుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి నిమ్మల

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో, నిర్వాసి తులకు న్యాయం చేయడం కూడా అంతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో వెలిగొండపై ప్రత్యేకంగా చర్చించారు. నీటి పారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల సమస్యలు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గురువారం మార్కాపురంలో ఈ అంశంపై సమీక్ష చేసిన మంత్రి.. ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి నిశిరాత్రి టన్నెల్‌ లోపలకు వెళ్లి మొత్తం పనులను పరిశీలించిన విషయం విదితమే. శుక్రవారం ఉదయమే అమరావతి వెళ్లి సమీక్షలో పాల్గొన్న ఆయన పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం... నిర్వాసితులు రోడ్డెక్కడం, కొన్నిపక్షాల వారు వారికి మద్దతుగా మాట్లాడుతుండటాన్ని ప్రస్తావిం చినట్లు తెలిసింది. ఒకటి, రెండు కార్మిక సంఘాలు లేక ఒకరిద్దరు విపక్ష నాయకులు సమస్యను పెద్దదిగా చేసేందుకు చూస్తుండటం నిజమేనని, అయితే పరిస్థితిని నిర్వాసితులు అర్థం చేసుకున్నారని నిమ్మల వివరించారు. అప్పట్లో చుక్కల భూముల పేరుతో నష్ట పరిహారం ఇవ్వని వాటికి, బాధితుల జాబితాలో స్థానం దక్కని అర్హులైన వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నారని ఆ విషయంపై పరిశీలన చేసి నిర్ధారించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పునరావాస గ్రామాల్లో పనులన్నీ చకచకా పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. వెంటనే సీఎం మిగిలిన డబ్బులు ఇవ్వాలని, మానవీయ కోణంలో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న ఉన్నతాధికారులను ఆదేశించారు. మనం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వడం ఎంత అవసరమో నిర్వాసితులకు అండగా నిలవడం, పునరావాస కాలనీల్లో వసతులు కల్పనకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వ్యాఖ్యానించారు.

పక్షం రోజుల్లో నీరు ఇవ్వాల్సిందే

వెలిగొండ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ రిజర్వాయర్లకు ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. చిన్నచిన్న కారణాలతో వాయిదాలు వేస్తూ పోతే ప్రాజెక్టు పూర్తిచేయలేమని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. మార్కాపుం జిల్లా ఏర్పాటు చేశాం.. వెలిగొండ జలాలు ఇచ్చి మాట నిలబెట్టుకుందామన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయా నికి వచ్చిన నీటిని ఇప్పుడే రిజర్వాయర్లకు మళ్లించుకోకపోతే మరో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తుందన్నారు. విషయాన్ని నిర్వాసితులకు అర్థమమయ్యేలా చెప్పాలని సీఎం సూచించినట్లు తెలిసింది. మంత్రితోపాటు మిగిలిన ఉన్నతాధికారులకు సమావేశం అనంతరం వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, ఇతర జిల్లా అధికారు లకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - Aug 15 , 2026 | 02:51 AM