Share News

మేదరమెట్ల పంచాయతీకి ఐఎ్‌సవో అవార్డు

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:10 PM

మేదరమెట్ల పంచాయతీ ప్రతిష్ఠాత్మక ఐఎస్‌వో అవార్డుకు ఎంపికైంది. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ చేతుల మీదుగా ఈ ఐఎ్‌సవో అవార్డును మేదరమెట్ల పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్‌ అందుకున్నారు.

మేదరమెట్ల పంచాయతీకి ఐఎ్‌సవో అవార్డు
కమిషనర్‌ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న కార్యదర్శి లక్ష్మీకాంత్‌

కమిషనర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పంచాయతీ కార్యదర్శి

మేదరమెట్ల, జూలై 15(ఆంధ్రజ్యోతి) : మేదరమెట్ల పంచాయతీ ప్రతిష్ఠాత్మక ఐఎస్‌వో అవార్డుకు ఎంపికైంది. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ చేతుల మీదుగా ఈ ఐఎ్‌సవో అవార్డును మేదరమెట్ల పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్‌ అందుకున్నారు. పంచాయతీరాజ్‌ నిబంధనల మేరకు ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు, పంచాయతీలో రికార్డుల నిర్వహణకుగాను ఈ అవార్డును అందించారు. 2029మే 11వ తేదీ వరకు ఈ ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ వర్తిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 27 పంచాయతీలు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. మేదరమెట్ల గ్రామ పంచాయితీ ఈ అవార్డుకు ఎంపికకాండంపట్ల ప్రజాప్రతినుధులు,గ్రామప్రజలు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్‌కి, సిబ్బందికి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - Jul 15 , 2026 | 11:10 PM