ఇక లేనట్లేనా?
ABN , Publish Date - Jul 30 , 2026 | 02:32 AM
పారదర్శకంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాయాలు కార్డుదా రులకు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించినా జిల్లాలో కొందరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. సుమారు 25,984 మంది ఇంకా పెండింగ్‌లో ఉండిపోయారు.
25,984 మంది ఈకేవైసీకి దూరం
జిల్లాలో ముందుకురాని కార్డుదారులు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : పారదర్శకంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాయాలు కార్డుదా రులకు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించినా జిల్లాలో కొందరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. సుమారు 25,984 మంది ఇంకా పెండింగ్‌లో ఉండిపోయారు. వీరిలో ఒంగోలు అర్బన్‌లో అత్యధికంగా 3,470 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దర్శి మండలంలో 1,523, చీమకుర్తిలో 1,416, దొనకొండలో 1,143, అద్దంకిలో 1,125, ఉలవపాడులో 1,041 మంది పెండింగ్ ఉన్నారు. మిగిలిన మండలాల్లో వెయ్యి మంది లోపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులోపు ఈకేవైసీ చేయించుకోని పక్షంలో వారిని హోల్డ్‌లో పెట్టనున్నట్లు సమాచారం. కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా కొన్ని కార్డుల్లో ఒకరిద్దరు చేయించుకోలేదు. ప్రస్తుతం ఆ కార్డుదారుల్లో ఎవరో ఒకరు తమ వేలిముద్రలు వేసి బియ్యాన్ని అందుకుంటున్నట్లు సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈనెలాఖరులోపు ఈకేవైసీ చేయిం చుకోని కార్డుదారుల పేర్లను హోల్డ్‌లో పెట్టడం వల్ల బియ్యం తీసుకునే అవకాశం ఉండదు.