గుంటూరు చానల్‌ను పొడిగిస్తేనే సాగు, తాగునీరు
ABN , Publish Date - Mar 25 , 2026 | 10:54 PM
గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తేనే తాగు, సాగునీరు అందుతుందని నల్లమడ రైతుసంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ చెప్పారు.
నల్లమడ రైతుసంఘం అఽధ్యక్షుడు డాక్టర్ రాజమోహన్
పర్చూరు, మార్చి 25 (ఆంఽద్రజ్యోతి) : గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగిస్తేనే తాగు, సాగునీరు అందుతుందని నల్లమడ రైతుసంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ చెప్పారు. చానల్ పొడిగింపుతో 56 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగించే విషయంపై రైతులు, ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజమోహన్ మాట్లాడుతూ గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతుసంఘం ఆధ్వర్యంలో ఎనిమిది దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నందిపాడు వరకే చానల్‌ను పొడిగించే విధంగా కార్యరూపం దాల్చడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం స్పందించి పర్చూరు వరకు కాలువను పొడిగించాలని డిమాండ్ చేశారు. చానల్‌ను పర్చూరు వరకు పొడిగించే వరకు తమ పోరాటం ఆగబోదన్నారు. దీనికి సంబంధించి కార్యాచణ రూపొందించటం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోటా హరిప్రసాద్, ఒగ్గిశెట్టి నరసింహం, కఠారి సురేంఽఽద్రబాబు, రంగిశెట్టి ఆంజనేయులు, తులసి శివనాగేశ్వరరావు, కోటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.