ఓపెన్ పరీక్షా కేంద్రాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:26 AM
ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం ఆంధ్రజ్యోతిలో అంతా ‘ఓపెన్‌గానే’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. పరీక్షా కేంద్రాలపై నిఘాను పెంచారు. మొత్తం 13 కేంద్రాలకు మండల విద్యాధికారులు వెళ్లి పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు అక్కడే తిష్ఠవేసి పర్యవేక్షించారు.
అక్కడే తిష్ఠవేసిన అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
ఒంగోలు విద్య, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. శనివారం ఆంధ్రజ్యోతిలో అంతా ‘ఓపెన్‌గానే’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. పరీక్షా కేంద్రాలపై నిఘాను పెంచారు. మొత్తం 13 కేంద్రాలకు మండల విద్యాధికారులు వెళ్లి పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు అక్కడే తిష్ఠవేసి పర్యవేక్షించారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకులు ఎన్.గీత మార్కాపురం, వైపాలెంలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.కొండారెడ్డి కూడా పాల్గొన్నారు. మార్కాపురం ఉపవిద్యాధికారి శ్రీనివాసులురెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి గిరిధరశర్మ కనిగిరిలోని నాలుగు కేంద్రాలను సందర్శించారు. వీటిని నలుగురు ఎంఈవోలు పర్యవేక్షించారు. ఒంగోలు, కొండపిలోని పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారి వై.వెంకట్రావు సందర్శించారు. శనివారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 400 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో రేణుక తెలిపారు. కెమిస్ట్రీ పరీక్షకు 1,732 మందికి 1,479 మంది హాజరు కాగా 253 మంది గైర్హాజరయ్యారు. ఎకనామిక్స్ పరీక్షకు 876 మందికి 729 మంది హాజరు కాగా 147 మంది గైర్హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో తెలిపారు.