Share News

ఒంగోలులో పెట్టుబడిదారుల సదస్సు

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:29 AM

జిల్లాలో పరిశ్రమల స్థాపనను మరింత వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జూన్‌ ఆఖ రులో ఈ దిశగా పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయిం చింది. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ రాజాబాబు శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఒంగోలులో పెట్టుబడిదారుల సదస్సు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

జిల్లాస్థాయిలో నిర్వహణకు అధికార యంత్రాంగం చర్యలు

అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పరిశ్రమల స్థాపనను మరింత వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జూన్‌ ఆఖ రులో ఈ దిశగా పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయిం చింది. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌ రాజాబాబు శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములు, ఇతర వనరులను గుర్తించడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను పెట్టుబడిదారులకు వివరించేలా ఇప్పటి నుంచే దృషివ్ట సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణపై సెంచూరియన్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నందున ఈ సదస్సును విజయవంతం చేసేలా ఆ యూనివర్సిటీని కూడా సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. వివిధ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిచూపుతున్న పెట్టుబడిదారులను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మదన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 02:29 AM