ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:41 AM
ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. తొలిరోజు కావడంతో పరీక్షాకేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు.
పర్చూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. తొలిరోజు కావడంతో పరీక్షాకేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. దీంతో కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మండల కేంద్రమైన పర్చూరు బీఏఆర్ అండ్ టీఏ కళాశాలలో తొలిరోజు నిర్వహించిన జూనియర్ ఇంటర్‌కు సంబందించి 226 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షా కేంద్రం ఛీప్ సూపర్‌ఇన్‌డెంట్ రవికుమార్ తెలిపారు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్
పర్చూరులో నిర్వహిస్తున్న ఇంటర్ మీడియేట్ పరీక్షా కేంద్రాన్ని తహసీల్దార్ పి.బ్రహ్మయ్య, ఎస్సై పులి గోపి తనిఖీ చేసి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎలాంటి ఆరోపణకు తావులేకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
వేటపాలెం(చీరాల) : పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వసతి కల్పనలో జాగ్రత్తలు పాటించాలని ఆర్‌డీవో చంద్రశేఖర్ నాయుడు చెప్పారు. సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేటపాలెం బీబీహెచ్ జూనియర్ కళాశాలను ఆర్‌డీవో పరిశీలించారు. నిబంధన లపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అలాగే ఏర్పాట్లును క్షుణ్ణంగా పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 10,075 మంది విద్యార్థులకు గాను 9584 మంది హాజర య్యారు. 491 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
మార్టూరు : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం మార్టూరు మండలంలో ప్రశాంతంగా నిర్వహించారు. మార్టూరులో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల శ్రీహర్షిణి జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ పరీక్షా కేంద్రాలను ఆర్‌డీవో గ్లోరియా సందర్శించారు. కేంద్రాల నిర్వహణ పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీహర్షిణి జూనియర్ కాలేజీలో 263 మంది విద్యార్థులకు గాను 251 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.