Share News

ముమ్మరంగా సీఎం సభ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:08 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేఎ్‌సపల్లి పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 27వ తేది మధ్యాహ్నం 12.50 గంటలకు కె.ఎ్‌స.పల్లెకు వచ్చి సాయంత్రం 5.15 గంటల వరకు గడపనున్న నేపథ్యంలో విస్తృతంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముమ్మరంగా సీఎం సభ ఏర్పాట్లు
హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేఎ్‌సపల్లి పర్యటన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 27వ తేది మధ్యాహ్నం 12.50 గంటలకు కె.ఎ్‌స.పల్లెకు వచ్చి సాయంత్రం 5.15 గంటల వరకు గడపనున్న నేపథ్యంలో విస్తృతంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేఎ్‌సపల్లి పీహెచ్‌సిలో సంజీవని పథకం, కొద్ది దూరంలో హెలిప్యాడ్‌ నిర్మా ణం, అలాగే గిద్దలూరు వైపునకు వచ్చే రో డ్డులో ప్రజావేదిక బహిరంగ సభకు, పార్టీ శ్రేణులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆయా ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సైతం ఆయన ఆసుపత్రి దగ్గర, హెలిప్యాడ్‌ దగ్గర, ప్రజావేదిక బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు, పార్టీ శ్రేణులకు వివరించారు. ప్రజావేదికకు హాజరయ్యే ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటితోపాటు అన్ని ఏర్పాట్లు చేయాలని, వాహనాల పార్కింగ్‌, రోడ్ల సౌకర్యం, విద్యుత్‌ తదితర సదుపాయాలపై ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.

పటిష్ట బందోబస్తు

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన దృష్ట్యా ప టిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. సీఎం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్‌ సర్వ్‌ సెం టర్‌ను ప్రారంభించిన అనంతరం ప్రజావేదికలో ప్రజలతో పాల్గొననున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో గురువారం ఎస్పీ, జేసీ పులి శ్రీనివాసులు, ఎస్‌ఎ్‌సజీ డీఎస్పీ కె.శివపోతురా జు, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు అధికారులతో కలిసి ముందస్తు భద్రతా చర్యలను పరిశీలించారు. కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ శ్రీనివాసరావు, సీఐలు కె.సురేష్‌, రామకోటయ్య, ప్రసాద్‌, వినోద్‌కుమార్‌, ఆర్‌ఐ రమణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:08 AM