Share News

సూచనలు.. హెచ్చరికలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:56 AM

ఉమ్మడి జిల్లాలో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోతైన విశ్లేషణ చేశారు. అనేక వ్యవహారాలపై తనకున్న సమాచారం, నివేదికలకు అనుగుణంగా సూచనలు, హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎంపీ మాగుంట, ఆరుగురు ఎమ్మెల్యేలు, రెండు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులతో సీఎం సమావేశమయ్యారు.

సూచనలు.. హెచ్చరికలు

నివేదికల ఆధారంగా ప్రతి అంశంపై విశ్లేషణ

నేతలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం

పొద్దుపోయే వరకూ కొనసాగిన సమీక్ష

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉమ్మడి జిల్లాలో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోతైన విశ్లేషణ చేశారు. అనేక వ్యవహారాలపై తనకున్న సమాచారం, నివేదికలకు అనుగుణంగా సూచనలు, హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎంపీ మాగుంట, ఆరుగురు ఎమ్మెల్యేలు, రెండు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులతో సీఎం సమావేశమయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనంతోపాటు కలెక్టర్‌, ఎస్పీ కూడా పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 7.30కు మెదలైంది. రెండు గంటల అనంతరం 9.45కు విరామం ఇచ్చి తిరిగి 10గంటల తర్వాత సమావేశాన్ని ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. కొన్నింటి అమలులో లోపం ఉన్నట్లు, ఆ విషయంలో అధికారుల వైఫల్యాలతోపాటు ఎమ్మెల్యేల్లో అప్రమత్తంగా లేనివారిని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాల అమలుపైనా సీఎం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాను, లోకేష్‌ జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక చొరవ తీసుకున్న విషయాన్ని వివరించారు. అదేతరహాలో మీరు స్థానికంగా ఇచ్చిన హామీల అమలుకు ఎంతమేర చిత్తశుద్ధితో పనిచేశారో సమీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిఽధులు, అధికారుల మధ్య సమన్వయం బాగుందని చెప్పారు. ఇదేసమయంలో ప్రజల్లోకెళ్లడంలో కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. వారి ప్రజాసంబంధాల శాతం తక్కువగా ఉందని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇసుక రవాణా విషయంలో కొందరి జోక్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇకపై ఉపేక్షించనని హెచ్చరించినట్లు తెలిసింది. ప్రజాసంబంధాల విషయంలో టాప్‌-10లో కొందరు, మధ్యస్తంగా మరికొందరు మొత్తంగా ఎక్కువమంది ఎమ్మెల్యేలు ముందువరసలో ఉన్నారన్నారు. అలాగే ఒకరిద్దరు వెనుకబడి ఉన్నారని చెబుతూ హెచ్చరికలు చేసినట్లు సమాచారం. మంత్రులు గొట్టిపాటి, డోలా పనితీరును కొనియాడారు. దర్శి, వైపాలెం నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించినట్లు తెలిసింది. అయితే సమావేశం నిర్వహణకు సంబంధించి అధికారికంగా ఫొటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.

Updated Date - Feb 28 , 2026 | 01:56 AM