Share News

ఒంగోలు ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:59 PM

ఒంగోలు మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌లు తెలిపారు.

ఒంగోలు ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీ శతాబ్దిన్నర ఉత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌లు తెలిపారు. బుధవారం ఒంగోలులోని మినీ స్టేడియంలోరోజంతా పండుగ వాతావరణంలో నిర్వహించనున్న ఒంగోలు 150 సంవత్సరాల వేడుకల ఏర్పాట్లను వారు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎక్కఇఉ ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే ఉదయం నుంచే ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేయనుండటంతో తాగునీరు, అల్పాహారం, మధ్యా హ్నం భోజనం ఇతర సౌకర్యాలు కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమాలు వీక్షించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేసిన ట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో ఉన్న ఒంగోలు వారు ఈ వేడుకలలో పాల్గొనేందుకు వస్తున్నారన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు పొడపాటి తేజశ్విని, నగర కమిషనరు టి. వెంకటకృష్ణయ్య, ఎంఈ ఏసయ్య, డీఈ, పద్మజ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:59 PM