విమానాశ్రయ భూముల పరిశీలన
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:28 AM
దొనకొండలోని బ్రిటీష్ కాలంనాటి విమానాశ్రయానికి చెందిన భూములను సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ గ్రూప్ కెప్టెన్ హరికృష్ణన్ బృందం బుధవారం పరిశీలించింది. దొనకొండ విచ్చేసిన ఈ బృందం విమానాశ్రయానికి చెందిన సర్వేనెంబర్ 14లోని 135 ఎకరాల భూమిని, చుట్టూ సరిహద్దులను, రికార్డులను పరిశీలించింది.
దొనకొండలో సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ బృందం పర్యటన
దొనకొండ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): దొనకొండలోని బ్రిటీష్ కాలంనాటి విమానాశ్రయానికి చెందిన భూములను సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ గ్రూప్ కెప్టెన్ హరికృష్ణన్ బృందం బుధవారం పరిశీలించింది. దొనకొండ విచ్చేసిన ఈ బృందం విమానాశ్రయానికి చెందిన సర్వేనెంబర్ 14లోని 135 ఎకరాల భూమిని, చుట్టూ సరిహద్దులను, రికార్డులను పరిశీలించింది. అనంతరం గతంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కోసం విమానాశ్రయానికి ఉన్న భూమితోపాటు అదనంగా గుర్తించిన 2,400 ఎకరాల భూమిని కూడా పరిశీలించారు. దొనకొండలోని విమానాశ్రయం ఏవిధంగా వినియోగంలోకి తేవాలి, ఎందు నిమిత్తం ఉపయోగపడుతుందో పూర్తిస్థాయిలో పరిశీలించాలన్న సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ బృందం దొనకొండ వచ్చినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం. ఈ బృందం తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి తహసీల్దార్ కిశోర్‌రెడ్డితో విమానాశ్రయ భూముల పూర్తి వివరాలను చర్చించి అందుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించింది.