పులి మృతిపై విచారణ ప్రారంభం
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:14 AM
గిద్దలూరు డివిజన్ తురిమెళ్ల రేంజ్‌లో పులి మరణంపై విచారణకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. చైర్మన్ అయిన ప్రభుత్వ సలహాదారు పి.మల్లికార్జునరావు, ఏపీసీఎఫ్ రాహుల్‌పాండే, సీనియర్ ఫీల్డ్ కన్జర్వేటర్ ఇమ్రాన్ సిద్ధిక్ తదిరులతో కూడిన ఈ కమిటీ బుధవారం రంగంలోకి దిగింది.
రంగంలోకి ఉన్నతస్థాయి కమిటీ
ఘటనా స్థలం పరిశీలన
కంభం (అర్ధవీడు), సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరు డివిజన్ తురిమెళ్ల రేంజ్‌లో పులి మరణంపై విచారణకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. చైర్మన్ అయిన ప్రభుత్వ సలహాదారు పి.మల్లికార్జునరావు, ఏపీసీఎఫ్ రాహుల్‌పాండే, సీనియర్ ఫీల్డ్ కన్జర్వేటర్ ఇమ్రాన్ సిద్ధిక్ తదిరులతో కూడిన ఈ కమిటీ బుధవారం రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది. తురిమెళ్ల రేంజ్ పరిధిలో ఒక పులి మరణించినట్లు సాధారణ గస్తీ బృందం గుర్తించి అటవీ అధికారులకు సోమవారం రాత్రి సమాచారం ఇచ్చింది. వారు మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సుమారు 3 సంవత్సరాల వయస్సు కలిగిన మగపులి కళేబరాన్ని గుర్తించారు. దాని శరీరంలోని అన్ని భాగాలు యథాతధంగా ఉన్నాయి. రెండు పులుల మధ్య జరిగిన సరిహద్దు పోరాటంలో యుక్త వయస్సు కలిగిన పులి మరణించిందని నిర్ధారించారు. ఈ నేప థ్యంలో ఘటనా స్థలాన్ని బుధవారం ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించింది.