Share News

వెలిగొండకు ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:14 AM

శ్రీశైలం ఎగువన కొల్లంవాగు నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తు తం రోజుకు 500 క్యూసెక్కుల నీరు మాత్రమే టన్నెల్‌ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు చేరుతోంది.

వెలిగొండకు ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు
కొల్లంవాగు వద్ద నీటి విడుదలను పరిశీలిస్తున్న అధికారులు

కొల్లంవాగు వద్ద తగ్గిన నీరు

నల్లమల సాగర్‌లో ప్రస్తుతం 6.72 టీఎంసీలు

మార్కాపురం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ఎగువన కొల్లంవాగు నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తు తం రోజుకు 500 క్యూసెక్కుల నీరు మాత్రమే టన్నెల్‌ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు చేరుతోంది. ఆగస్టు 31న సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించారు. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమేణా పరిమాణాన్ని 5వేల క్యూసెక్కులకు పెంచారు. శ్రీశైలంలో ప్రస్తు తం నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో కొల్లంవాగు వద్ద నీటి స్థాయి పడిపోయి ప్రవాహ వేగం మందగించింది. దీంతో నాలుగు రోజుల క్రితం ఇన్‌ఫ్లో 1,500 క్యూసెక్కులకు పడిపోయింది. గురువారం నుంచి ఇంకా తగ్గింది. రెండురోజుల నుంచి కేవలం 500 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. నల్లమల రిజర్వాయర్‌లో 10.7 టీఎంసీల నీటిని నింపాలన్నది లక్ష్యం కాగా శుక్రవారానికి 6.72 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నాలుగు రోజుల వర కు మాత్రమే నీటి విడుదలకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

Updated Date - Sep 26 , 2026 | 03:14 AM