Share News

పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర వేడుకలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:00 AM

జిల్లావ్యాప్తంగా స్వాతం త్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారితో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పండుగ వాతావరణంలో స్వాతంత్య్ర వేడుకలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు, పక్కన జేసీ కల్పనాకుమారి

వికసిత్‌ భారత్‌లో అందరూ భాగస్వాములు కావాలి

15 వరకూ వివిధ కార్యక్రమాలు 8 కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా స్వాతం త్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారితో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం అధికారిక వేడుకగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం నుంచి ఈనెల 15వతేదీ వరకు రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ సందేశంతో జిల్లాలోని అన్ని మండలాలు, జిల్లాకేంద్రంలో తిరంగా సైకిల్‌ ర్యాలీలు చేస్తామన్నారు. ఈనెల 13నుంచి హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వికసిత భార త్‌-47 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఐఏఎస్‌లు, వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపార వేత్తలు, సామాజిక కార్యకర్తల నుంచి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ తాము దేశాభివృద్ధికి ఏవిధంగా సేవ చేస్తారో వివరిస్తూ స్వచ్ఛందంగా సెల్పీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌ నుంచి మునిసిపల్‌ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - Aug 12 , 2026 | 02:00 AM