పెరిగిన ఎంపీటీసీలు, వార్డులు
ABN , Publish Date - Aug 15 , 2026 | 02:48 AM
బీసీ రిజర్వేషన్లపై నియమించిన గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు- బీసీ రిజర్వేషన్ అధ్యయన (డెడికేటెడ్ కమిషన్) రాజీవ్ రంజన్‌మిశ్ర కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన పదవులు, ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కేటాయించాల్సిన వాటితోపాటు కుటుంబ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది.
స్వల్పంగా తగ్గిన సర్పంచ్‌ల పదవులు
బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదించిన కమిషన్
ఒంగోలు కలెక్టరేట్, మే 26 (ఆంధ్ర జ్యోతి): బీసీ రిజర్వేషన్లపై నియమించిన గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు- బీసీ రిజర్వేషన్ అధ్యయన (డెడికేటెడ్ కమిషన్) రాజీవ్ రంజన్‌మిశ్ర కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన పదవులు, ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కేటాయించాల్సిన వాటితోపాటు కుటుంబ సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఆ ప్రకారం జిల్లాలో సర్పంచ్‌ల పదవులు స్వల్పంగా తగ్గగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీల్లో బీసీలకు వార్డులు, సీట్లు పెరిగాయి. జిల్లాలో 2021లో 515 పంచాయతీల్లో 81 పదవులకు బీసీలకు దక్కగా 2026 బీసీ కమిషన్ జిల్లాలో 519 గ్రామ పంచాయ తీల్లో 77 పదవులకు సిఫారసు చేసింది. 2021లో జిల్లాలో 718 ఎంపీటీసీలకు 135 సీట్లు బీసీలకు కేటాయించగా 2026లో 773 సీట్లకు 145 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. 2021లో 55 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 సీట్లను బీసీలకు కేటాయించగా, 2026లో కూడా 11 సీట్లను ఇవ్వాలని సిఫార్సు చేసింది. జిల్లాలో 2021లో 110 మునిసిపల్ వార్డులు ఉండగా బీసీలకు 32 కేటాయించారు. ఈసారి 142 సీట్లకు 43 కేటాయించాలని సిఫార్సు చేసింది. 2021 ఎన్నికల్లో వివిధ కారణాలతో గ్రామపంచాయతీలు, ఎంపీటీసీలు, ఇతర పదవులకు కోర్టులో కేసులతో ఎన్నికలు జరగని అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రంజన్‌మిశ్ర కమిషన్ ఈ సిఫార్సు చేసినట్లు తెలిసింది.