Share News

పెరిగిన మొక్కజొన్న ధర

ABN , Publish Date - May 20 , 2026 | 02:30 AM

ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు లేక తల్లడిల్లిపోయారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర రూ.2,400 ప్రకటించినా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,700కు కొనుగోలు చేశారు.

పెరిగిన మొక్కజొన్న ధర
కల్లంలో ఆరబోసి ఉన్న మొక ్కజొన్నలు (ఫైల్‌)

రైతుల వద్ద పూర్తయిన అమ్మకాలు

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.2వేలకు కొనుగోలు

లబ్ధి పొందుతున్న వ్యాపారులు

అద్దంకి, మే 19 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న సాగు చేసిన రైతులు పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు లేక తల్లడిల్లిపోయారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర రూ.2,400 ప్రకటించినా బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,700కు కొనుగోలు చేశారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొక్క జొన్న సాగు చేపట్టిన రైతులలో అత్యధిక శాతం సన్నచిన్నకారుతోపాటు కౌలు రైతులు ఉన్నారు. దీంతో పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చేం దుకు, కౌలు చెల్లించేందుకు డబ్బులు అవస రమై తక్కువ ధరకే అమ్ముకున్నారు. ఎకరాకు సరాసరిన రైతులు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అంచనా మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో సుమారు లక్ష ఎక రాల్లో మొక్కజొన్న సాగైంది. 40 లక్షల క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. వీటిలో మూడొంతుల అమ్మకాలు పూర్తయ్యాయి. కొంత మంది రైతులు, మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యాపారులు కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వ చేశారు. ప్రస్తుతం క్వింటా రూ.2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులకు నెల వ్యవధిలోనే క్వింటా రూ.300 చొప్పున లాభం వచ్చింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో వ్యాపారులు వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. కోల్డ్‌ స్టోరేజీల్లో మొక్కజొన్నను నిల్వ చేసిన రైతులు మాత్రం కొంతలో కొంత ధర వచ్చింది కాబట్టి అమ్ముకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొంతమేర కొనుగోలు చేపట్టి ఉన్నా వ్యాపారులు కూడా తప్పనిసరి పరిస్థితులలో కొనుగోలు చేసి ఉండేవారన్న అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పొగాకు, మిర్చి తదితర పంటలు సాగు చేసి నష్టపోయిన పలువురు రైతులు ఈఏడాది మొక్కజొన్న సాగుచేసి కూడా నష్టాలు చవిచూశారు. ప్రభుత్వం ముందస్తుగానే మద్దతు ధర ప్రకటించి అన్నిరకాల పంట ఉత్పత్తులను కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించి కొనుగోలు చేపట్టినప్పుడు మాత్రమే బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 20 , 2026 | 02:30 AM