Share News

తొలిరోజు 702 పంచాయతీల్లో..

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:42 AM

ఉపాధి పండుగ పేరుతో నెలరోజులపాటు చేపట్టిన పనులు పూర్వపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమయ్యాయి, మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 729 గ్రామపంచాయతీలు ఉండగా తొలిరోజు కూలీలు ఎంతమంది హాజరు అన్న విషయాన్ని పక్కనపెట్టి అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

తొలిరోజు 702 పంచాయతీల్లో..
చిర్రికూరపాడులో ఉపాధి పనులను ప్రారంభిస్తున్న మంత్రి స్వామి, కలెక్టర్‌ రాజాబాబు

ఉపాధి పండుగ ప్రారంభం

చిర్రికూరపాడులో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పండుగ పేరుతో నెలరోజులపాటు చేపట్టిన పనులు పూర్వపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమయ్యాయి, మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో 729 గ్రామపంచాయతీలు ఉండగా తొలిరోజు కూలీలు ఎంతమంది హాజరు అన్న విషయాన్ని పక్కనపెట్టి అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. తదనుగుణంగా 702 పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఉపాధి హామీ పథకం చట్టంలో పేరుతో సహా పలు సవరణలను తెచ్చిన కేంద్రం ఈనెలాఖరు వరకు పాత చట్టమైన నరేగా నిబంధనల ప్రకారం పనులకు అనుమతించిన విషయం విదితమే. దానిని సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు భారీ లక్ష్యాలను ఇవ్వడంతోపాటు తొలిరోజైన బుధవారం ఉపాధి పండుగ పేరుతో ఊరూరా పనులు ప్రారంభించాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లాలో నాలుగు, మార్కాపురం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో 729 గ్రామపంచాయతీలు ఉండగా 702చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక డ్వామా సిబ్బంది కూలీల సమక్షంలో పూజలు నిర్వహించి వీటిని చేపట్టారు. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు చెరువులో మంత్రి డాక్టర్‌ స్వామి, కలెక్టర్‌ రాజాబాబు పనులను ప్రారంభించారు. డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు పరిమితంగానే కూలీలు పనులకు వచ్చినట్లు సమాచారం. ముఖహాజరు నమోదులో కూడా కొన్ని అవాంతరాలు ఎదురైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో లక్ష్యం మేర కూలీలు పనులకు హాజరయ్యేలా డ్వామా, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 02:42 AM