Share News

విద్యా నైపుణ్యాలను మెరుగుపర్చాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:57 PM

నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలల్లో విద్యా నైపుణ్యాలను మెరుగుపరచి ప్రతి పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.

విద్యా నైపుణ్యాలను మెరుగుపర్చాలి
విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

జడ్పీ బాల, బాలికల హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ

గిద్దలూరు టౌన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలల్లో విద్యా నైపుణ్యాలను మెరుగుపరచి ప్రతి పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని యాదవ బజారులో గల జిల్లాపరిషత్‌ బాలబాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయనే విద్యార్థులకు భోజనం వడ్డించారు. తరగతిగదిని పరిశీలించి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే సొంతంగా 10 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అదనపు తరగతి గదులు, అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న గదులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంఈవో అశ్వనీకుమార్‌, నాగభూషణ్‌రెడ్డి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి, నంది శ్రీను, దమ్మాల జనార్థన్‌, లొక్కు రమేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 11:57 PM