ఓపీఎస్ ద్వారా వెలుగులు
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:18 PM
రాష్ట్రంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి
సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీచర్లు
గిద్దలూరు టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కృతజ్ఞతగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. మంగళవారం రాత్రి పట్టణంలో టీడీపీ కార్యాలయంలో 30 మంది ఉపాధ్యాయులు ఓపీఎస్ విధానాన్ని అమలు పరిచినందుకు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేత కేక్ కట్ చేయించారు. విద్యామంత్రి నారా లోకే్‌షకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించాలి
ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని గిద్దలూరు తాలూకా చైర్మన్ టి.నరే్‌షబాబు, కార్యదర్శి కాశిరమణ, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. పీఆర్‌సీ కమిటీ చైర్మన్‌ను నియమించాలని, అలాగే ఐఆర్ ప్రకటించి డీఏను విడుదల చేయాలని కోరారు. సీనియర్ టీచర్స్‌కి టెట్ మినహాయించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్ అడ్వాన్స్ స్కీమ్ అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు.