Share News

అక్రమ మద్యాన్ని నియంత్రించాలి

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:23 AM

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌శర్మ ఆదేశించారు. జిల్లాలో బుధవారం వారు పర్యటించారు.

అక్రమ మద్యాన్ని నియంత్రించాలి
మద్యం దుకాణంలోని బాటిళ్లను పరిశీలిస్తున్న శ్రీధర్‌

అధికారులకు ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ ఆదేశం

ఒంగోలు క్రైం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌శర్మ ఆదేశించారు. జిల్లాలో బుధవారం వారు పర్యటించారు. తొలుత ఒంగోలులోని ఓ వైన్‌షాపునకు వెళ్లి స్టాక్‌ను పరిశీలించారు. ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌ ద్వారా బాటిళ్లను చూశారు. అనంతరం పేర్నమిట్ట ఏపీఎస్‌బీసీఎల్‌ డిపోను సందర్శించారు. అవసరం మేరకు మద్యం సరఫరా జరుగుతుందా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మద్యం అక్రమ విక్రయాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. నాటుసారా, కల్తీ మద్యం తయారు చేసే అవకాశం ఉన్నందున పూర్తిగా అరికట్టాలన్నారు. ఎన్నికల నియమావళి గురించి వివరించారు. ఎన్నికల సందర్భంగా అక్రమ నిల్వలు ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి మద్యం దుకాణం వద్ద హెల్ప్‌లైన్‌ 14405 టోల్‌ఫ్రీ నంబరు స్పష్టంగా కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు, ఈఎస్‌ షేక్‌ అయేషాబేగం పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 02:23 AM