Share News

ఆరోపణలు రుజువైతే చర్యలు తప్పవు

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:40 PM

ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువైతే సిబ్బందిపై చర్యలు తప్పవని ఉపాధి హామీ ఏపీడీ జీకే నిర్మలాదేవి అన్నారు.

ఆరోపణలు రుజువైతే చర్యలు తప్పవు
విచారణ జరుపుతున్న ఏపీడీ

రాచర్ల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువైతే సిబ్బందిపై చర్యలు తప్పవని ఉపాధి హామీ ఏపీడీ జీకే నిర్మలాదేవి అన్నారు. మండలంలోని చోళ్లవీడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రసాద్‌ ఉపాధి పనుల నిర్వహణలో దొంగ మస్టర్లను వేయడంతోపాటు స్థానికంగా లేని వారిని ఉన్నట్లు చూపించి అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు అందాయి. దీంతో ఆమె ఆరోపణలు చేసిన వారి నుంచి మంగళవారం ఆధారాలను సేకరించారు. ఒకటి, రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆరోపణలు రుజువైతే ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌.వెంకటరామిరెడ్డి, ఏపీడీ సీవో నారాయణ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:40 PM