Share News

హెచ్‌పీవీ వేగవంతం

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:06 AM

జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వైద్యశాఖ వేగవంతం చేసిం ది. బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాలతో 14 నుంచి 15ఏళ్లలోపు బాలికలకు ఆ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు.

హెచ్‌పీవీ వేగవంతం

సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌

జిల్లాలో 11వేల మంది బాలికలకుగాను 5వేల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వైద్యశాఖ వేగవంతం చేసిం ది. బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆదేశాలతో 14 నుంచి 15ఏళ్లలోపు బాలికలకు ఆ వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. ఈ ప్రక్రియను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గతనెల 8వతేదీన కలెక్టర్‌ రాజాబాబు ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో నిర్దేశిత వయసు బాలికలు 11వేల మంది ఉన్నట్లు గుర్తించగా అందుకు అనుగుణంగా వ్యాక్సిన్‌ను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇప్పటివరకు 5వేల మంది బాలికలకు ఈ వ్యాక్సిన్‌ వేసినట్లు సమాచారం. మిగిలిన వారికి మే ఆఖరులోపు పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. అందుకోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిన బాలికలు ఎక్కువమంది ఇటీవలనే పదో తరగతి పరీక్షలు రాశారు. పరీక్షల ముగియడంతో వారిని వైద్యశాఖ సిబ్బంది ఆయా పీహెచ్‌సీల వద్దకు తీసుకువచ్చి డాక్టర్‌ల పర్యవేక్షణలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 03:06 AM