Share News

నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:22 AM

వెలిగొండ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను మార్కాపురం కలెక్టర్‌ ఎం.విజయ సునీత బుధవారం పంపిణీ చేశారు. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాలకు చెందిన 468 మందికి వారికి కేటాయించిన నిర్వాసిత కాలనీల్లో ప్లాట్లను ఇచ్చారు.

నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు
వెలిగొండ నిర్వాసితునికి ఇంటి పట్టాను అందజేస్తున్న మార్కాపురం కలెక్టర్‌ విజయసునీత

468 మందికి పంపిణీ చేసిన కలెక్టర్‌ విజయసునీత

మార్కాపురం కలెక్టరేట్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను మార్కాపురం కలెక్టర్‌ ఎం.విజయ సునీత బుధవారం పంపిణీ చేశారు. గొట్టిపడియ, అక్కచెరువు గ్రామాలకు చెందిన 468 మందికి వారికి కేటాయించిన నిర్వాసిత కాలనీల్లో ప్లాట్లను ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మిగిలిన అన్ని గ్రామాల ప్రజలకు కూడా త్వరలోనే పట్టాలను ఇస్తామని చెప్పారు. పట్టాలు పొందిన వారంతా వెంటనే కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, ప్రాజెక్టు అధికారులు ఉన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 03:22 AM