Share News

రాష్ట్ర రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:28 AM

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కొమరోలుమండలంలోని మదవపల్లి క్రాస్‌రోడ్డులోని రాష్ట్ర రహదారిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

రాష్ట్ర రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీలో ఇరుక్కుని మృతి చెందిన డ్రైవర్‌ సలీం

ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

కొమరోలు, సెస్టెంబరు 11(ఆంధ్రజ్యోతి) : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండలంలోని మదవపల్లి క్రాస్‌రోడ్డులోని రాష్ట్ర రహదారిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తెలిసిన వివరాల మేరకు... విజయవాడ నుంచి కడపకు ప్లే ఉడ్‌ను తీసుకొని ఓ లారీ వెళ్తుండగా, బెంగళూరు నుంచి విజయవాడకు డ్రైవర్‌ సలీంతోపాటు క్లీనర్‌ సురేంద్రలు వెళ్తున్నారు. మార్గమధ్యలో కొమరోలు మండలంలోని మదవపల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలోని రాష్ట్ర రహదారిలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈసంఘటనలో ఒక లారీ డ్రైవర్‌ సలీం అక్కడికక్కడే మృతి చెందగా, మరో డ్రైవర్‌ ఫకృద్దీన్‌ మాత్రం తలకు బలమైన గాయాలు కాళ్లు పూర్తి విరిగిపోయాయి. క్లీనర్‌ సురేంద్రకు లారీ నుంచి కిందికి దూకే సరికి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వచ్చి డ్రైవర్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై కోటా నాగేంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్ల సహాయంతో తీసి ప్రాణాలతో ఉన్న డ్రైౖవర్‌ ఫకృద్దీన్‌ను 108లో పోరుమామిళ్ల వైద్యశాలకు తరలించారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది ఎస్సై నాగేంద్రరావు ఎక్స్‌కవేటర్లను తెప్పించి లారీలను పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించారు.

Updated Date - Sep 12 , 2026 | 12:28 AM