Share News

ఆశాజనకం

ABN , Publish Date - Jun 12 , 2026 | 03:00 AM

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. పలు పెండింగ్‌ అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రత్యేకించి ఉమ్మడి జిల్లా భవిష్యత్‌కు ఉపకరించి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే.. సాగు, తాగునీటి ఇక్కట్లు తీర్చడంతో పాటు ఉపాధి మార్గాలను పెంపొందించే ప్రాజెక్టులు పట్టాలె క్కాయి.

ఆశాజనకం
రామాయపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న పోర్టు

రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి

వెలిగొండ వేగవంతం, మార్కాపురం జిల్లా ఏర్పాటు, సీబీజీ ప్లాంట్లు

రామాయపట్నం పోర్టు కేంద్రంగా పారిశ్రామిక, ఉపాధి కల్పన ప్రాజెక్టులు

దొనకొండ కారిడార్‌పైనా ఫోకస్‌

హార్టికల్చర్‌ హబ్‌లో రెండు జిల్లాలు

ఇంకా చేపట్టాల్సినవి అనేకం

ట్రిపుల్‌ ఐటీ, వర్సిటీ నిర్మాణాలు అవసరం

ఒంగోలు డెయిరీ పునరుద్ధరణ కీలకాంశం

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. పలు పెండింగ్‌ అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించింది. ప్రత్యేకించి ఉమ్మడి జిల్లా భవిష్యత్‌కు ఉపకరించి దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే.. సాగు, తాగునీటి ఇక్కట్లు తీర్చడంతో పాటు ఉపాధి మార్గాలను పెంపొందించే ప్రాజెక్టులు పట్టాలె క్కాయి. ఈ విషయంలో గత ఎన్నికల సమయంలో, అంతకు ముందు వివిధ సందర్భాల్లో యువనేత నారా లోకేష్‌ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు తీసుకున్నారు. అదేసమయంలో మరికొన్ని అంశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఒంగోలు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రజలకు ఉపకరించే పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేకించి పశ్చిమప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు వేగవం తమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది నీటిని ఇవ్వాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఆ మేరకు ప్రజల్లో కూడా నమ్మకం కలిగింది. మరో ప్రధానమైన జిల్లా పునర్విభజన జరిగింది. పశ్చిమప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా నాలుగు నియోజకవర్గాలతో నూతన జిల్లా ఏర్పడింది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను తిరిగి ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో చేర్చడం ప్రజలకు ఊరట నిచ్చింది. తాజాగా రాయలసీమ రీజియన్‌లో రూ.లక్ష కోట్లతో చేపడుతున్న హార్టికల్చర్‌ హబ్‌లో ఉమ్మడి జిల్లాను చేర్చడం ద్వారా ఈ ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపింది. మరోవైపు రామాయ పట్నం పోర్టు తొలిదశ నిర్మాణాన్ని ఒక కొలిక్కి తీసుకురావ డంతోపాటు పోర్టు కేంద్రంగా భారీ పెట్టుబడితో బీపీసీఎల్‌ ప్రాజెక్టు, మరికొన్ని పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

ఉపాధి మార్గాల కోసం ప్రయత్నాలు

కనిగిరి నియోజకవర్గం కేంద్రంగా బీడు భూములను సైతం భారీగా లీజుకు ఇచ్చి రైతులకు ఉపకరించేలా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాం ట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆ ప్లాంట్లను మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలకు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. దొన కొండ పారిశ్రామిక కారిడార్‌ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు ప్రయ త్నాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా అటు వెలిగొండ, హార్టికల్చర్‌ హబ్‌ల ద్వారా వ్యవసాయ రంగం, వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉమ్మడి జిల్లాలో ఉపాధి మార్గాలు మెరుగుపడనున్నాయి. అలాగే గతం కన్నా రైలు, రోడ్డు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో కొంతమేర పురోగతి కనిపిస్తోంది.

డెయిరీని పట్టించుకోలేదు

ప్రభుత్వం దృష్టి సారించాల్సిన దీర్ఘకాల పెండింగ్‌ అంశాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి జిల్లాకు తలమానికమైన ఒంగోలు డెయిరీ విషయంలో ప్రజాప్రభుత్వ వైఖరిపై పాడి రైతులు, రాజకీయవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఒంగోలు డెయిరీకి సమాధి కట్టగా అధికారంలోకి వచ్చాక పునరుద్ధరిస్తామని పలుమార్లు చంద్రబాబు, లోకేష్‌ హామీ ఇచ్చారు. అయితే ఆదిశగా ఇప్పటి వరకూ ఒక్క ప్రయత్నం జరగ లేదు. ఆ అంశాన్ని వారు పట్టించుకోవడం లేదన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే నడుస్తోంది. ఫలితంగా ఒంగోలుతోపాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డెయిరీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములు, భవనాలు, మిషనరీ, ఇతర ఆస్తులు నిరర్థకంగా పడి ఉన్నాయి. అవి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రశ్నార్థకంగా వర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ నిర్మాణం

ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ నిర్మాణాలు ఎప్పటికి అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. కీలకమైన జల జీవన్‌ మిషన్‌ పరిధిలోని భారీ తాగునీటి పథకాల నిర్మా ణాలు, రామతీర్థం రిజర్వాయర్‌ ఎత్తు పెంపు, గుండ్లకమ్మ లో కొత్త చెక్‌డ్యాంల నిర్మాణం, ఒంగోలులో రూ.100 కోట్లతో భూగర్భ డ్రైనేజీ తదితరాలపై ప్రభుత్వం దృష్టిసారించకపో వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సంగమే శ్వర ప్రాజెక్టుకు రూ.165 కోట్ల కేటాయింపు, కొత్తపట్నం వద్ద రూ.441 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ మంజూరు కావడం ఆ ప్రాంతాల అభివృద్ధికి ఉపకరించనున్నాయి. ఇక ప్రభు త్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల లబ్ధి ఆయా వర్గాలకు అందుతుండగా పెద్దసంఖ్యలో లబ్ధిదారులు వాటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. రెండేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా పెండింగ్‌ అంశాలపై పాలక పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jun 12 , 2026 | 03:00 AM