Share News

పేద రోగులకు అండ

ABN , Publish Date - May 24 , 2026 | 11:37 PM

అనారోగ్యంతో బాధపడే పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నా రు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.22.23 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను 25 మంది లబ్ధి దారులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అందజేశా రు.

పేద రోగులకు అండ
బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడే పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నా రు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.22.23 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను 25 మంది లబ్ధి దారులకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అందజేశా రు. ఆర్థిక స్థోమతలేక వైద్యానికి దూరం గా కాకూడదనే ఉద్దేశంతో వారికి కార్పొరేట్‌ స్థాయి వైద్యం చేయించుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి సహాయనిధి నుం చి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంలేని ఆంధ్రప్రదేశ్‌ను రూ పొందించడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటివరకు 1,068 మంది 8.89కోట్ల సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను అం దించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ బాలీశ్వరయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

గిద్దలూరు నియోజకవర్గంలో ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించే వర్చువల్‌ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో వర్చువల్‌ మహానాడు కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2026 | 11:37 PM